Tuesday, 3 November 2026

17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌: సిఎస్‌

హైదరాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి): తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఏయిడ్‌ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ కె.జోషి తెలిపారు. గురువారం సచివాలయంలో సి.యస్‌ అధ్యక్షతన తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ స్టేట్‌ లెవల్‌ కమిటి సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఎస్సి సంక్షేమ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాష్‌ జ్యోతి, కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ సోనిబాలాదేవి, డైరెక్టర్‌ కరుణాకర్‌ తది తరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి.యస్‌ మాట్లాడుతూ వివిధ జిల్లాలలో అనాధ బాలలు, వృద్ధ ఆశ్రమాలు, బుద్దిమాంద్యపిల్లలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్ధలకు 50 శాతం ఇచ్చే గ్రాంట్‌ ను 75 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సి.యస్‌ వెల్లడించారు. ప్రభుత్వ సహాయం పొందిన ఎన్జీఓలు సేవాదృక్పధంతో పని చేసి రోల్‌ మాడల్‌ గా నిలపాలని, ఈ సంస్ధలను జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారులు సందర్శించాలని ఆయన కోరారు. మేడ్చల్‌ జిల్లాలో -2, రంగారెడ్డి -5, నల్గొండలో-3, నాగర్‌ కర్నూల్‌-1, వరంగల్‌-1, ఆదిలాబాద్‌-1, మంచిర్యాల్‌ -1, పెద్దపల్లి-1, మహబూబ్‌ నగర్‌ లో ఒకటి స్వచ్ఛంద సంస్ధలనుండి వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.