టిడిపి సభతో అప్రమత్తం అయిన నేతలు
జగన్‌తో అత్యవసర బేటీలో నిర్ణయం
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో వైఎస్సార్ సీపీ కీలక నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగు రమేష్, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేపిదేవి వెంకటరమణ, విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిడిపి బిసి గర్జన నిర్వహించిన నేపథ్యంలో ఈ బేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న ఆంధప్రదేశ్‌లో బీసీ గర్జన
నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి సమావేవానంతరం విూడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పలు కీలక విషయాలు విూడియాకు వెల్లడించారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధ్యయన సమావేశాలు నిర్వహించామని, అధ్యయన కమిటీ ద్వారా అనేక అంశాలతో కూడిన నివేదికను సోమవారం వైఎస్ జగన్‌కు అందజేశామని పేర్కొన్నారు. వాటి గురించి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో సవిూక్షించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు.. వాటినే మళ్లీ కొత్త గా చెబుతున్నారని కృష్ణమూర్తి మండిపడ్డారు. 2014 మ్యానిఫెస్టోలో పెట్టిన హావిూలను టీడీపీ ఏమేరకు అమలు చేసిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బీసీలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ప్రలోభ పెట్టి, వారి ఓట్లు వేయించుకుని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని.. ఈ విషయాన్ని స్వయంగా జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన చంద్రబాబుకు జయ¬ బీసీ అనే అర్హత లేదని విమర్శించారు. తమ అధ్యయనంలో భాగంగా సంచార జాతులను కూడా కలిశామని.. కొంత మంది బీసీలకు తమ కులం ఏమిటో కూడా స్పష్టంగా తెలియదనడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు.




