Thursday, 5 November 2026

June 2012

వార్తలు

అనంతపురం,రాయదుర్గంలో వైకాపా ముందంజ

అనంతపురం: అనంతపురం,రాయదుర్గం  నియోజకవర్గల్లో వైకాపా ఆధిక్యంలో కొనసాగుతోంది.రాయద్గుంలో ఎనిమిదో  రౌండ్‌ పూర్తియ్యేసరికి 17,408,ఏడోరౌండ్‌ ముగిసేసరికి అనంతపురంలో 11994 ఓట్ల ఆధిక్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.

వార్తలు

రెండింటిలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఆధిక్యం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 స్థానాల్లో రెండింటిలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఐదు రౌండ్లు  పూర్తియ్యేసరికి రామచంద్రాపురం,నరసాపురంలలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

వార్తలు

ఉదయగిరిలో ముందంజలో వైకాపా

ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా దూసుకపోతోంది. ఆరు రౌండ్లు  పూర్తియ్యేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పై 8,994 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.

Cover Story

సకల జనుల హామీలు అమలుచేయండి

సింగరేణి సీఎండీకి డిమాండ్ల పత్రం అలక్ష్యం చేస్తే ఆందోళన తప్పదు : కోదండరాం హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : సకల జనుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.…

వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ బరిలో దిగనున్నారు. దేశరాజధానిలో గురువారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్రపతి…

తెలంగాణ

తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాట్‌) ఏర్పాటు

హైదరాబాద్‌ : తెలంగాణలోని పది జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి కోసం క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (క్యాట్‌) పేరిట నూతన సంఘం ఆవిర్భవించింది. ఈ నూతన సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల…

వార్తలు

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించాలనే విషయంపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు…

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికపై రాజదానిలో వేడెక్కిన రాజకీయం

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై రాజకీయా పార్టీలతో పాటు ప్రజలందరికి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది సర్వత్ర ఉత్కంట నెలకోన్న సమంయంలో దేశ రాజదానిలో రాజకీయా వాతవారణం ఒక్కసారిగ వేడెక్కింది ఇటు యూపిఏ, ఎన్‌డియే పక్షాలు సమావేశాలు జరుపుతున్నారు. ఈరోజు…

వార్తలు

విశాఖపట్నం చమురు కంపెనీల్లో తనిఖీలు

విశాఖపట్నం: చమురు భద్రతా మండలి బృందంలోని డైరక్టర్ల ఈడి స్థాయి అధికారులు హెచ్‌పీసీఎల్‌, బీపిసీఎల్‌, ఐఓసీలలో తనిఖిలు నిర్వహించారు. ఐఓసీలో భద్రతపై నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను వీరు పరిశీలించారు.