Wednesday, 4 November 2026

June 2012

వార్తలు

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ పహిల్వాన్‌

ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్‌ పహిల్వాన్‌ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్‌ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ రాష్ట్ర ప్రభుత్వం సమాదానం ఇవ్వాలని సుప్రిం ఆదేశించింది.

సీమాంధ్ర

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.దుకాణాలు, విద్యాసంస్థలు పనిచూస్తున్నాయి. అంతకు ముందు దీక్షకు మద్దతుగా ఆందోళన…

హైదరాబాద్

తిరుపతి, రాయదుర్గం నేతలతో నేడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తిరుపతి, రాయదుర్గం నియాజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయిడు  నేడు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నిన్న రాయచోటి నేతలతో చంద్రబాబు భేటీ అయి ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

Featured News

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి

బీసీ సంక్షేమానికి నిధులు పెంచుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి చేరువగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక వహిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వం ఇస్తున్న…

వార్తలు

400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేలమట్టం

చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీకోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కుప్పకూలింది. భారీ వృక్షం పడడంతో దేవాలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణమండం కూడా నేలమట్టమయ్యాయి,  ఇది…

హైదరాబాద్

గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌ శివబాగ్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతున్ని సబ్జిమండికి చెందిన విద్యానంద్‌గా గుర్తించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణం తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్మాప్తు చేపట్టారు.

హైదరాబాద్

సీఎం ను కలిసిన హోంమంత్రి సబిత

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తో ఈ ఉదయం హోం మంత్రి సబితాఇంద్ర రెడ్డి క్యాంపు కార్యలయంలో సమావేశమయ్యారు. వీరి భేటిలో రాష్ట్రంలో నెల కొన్న శాంతి భద్రతల విషయం చర్చించినట్లు సమాచారం

ఖమ్మం

కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.

హైదరాబాద్

క్యాట్‌ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌: డీజీపీ నియామకం చెల్లదంటూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ దినేష్‌రెడ్డి వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ ఐపీఎస్‌…

వార్తలు

వరంగల్‌లో నగల షాపుల చోరి

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.