Thursday, 5 November 2026

June 2012

వార్తలు

మంత్రాలయ అగ్నిప్రమాదంలో 5కి చేరిన మృతుల సంఖ్య

ముంబాయి: మహారాష్ట్ర సచివాలయ భవనం మంత్రాలయలో సంభవించిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 5కి చేరింది. ఇంకా కొంతమంది కన్పించడం లేదని తెలుస్తొంది. ఈ భవనం నుంచి దాదాపు 3వేల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం భవనాన్ని చల్లబరిచే ప్రయత్నంచేస్తున్నారు.…

వార్తలు

రైల్వే సిబ్బంది మహా ధర్నా

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం ఎదురుగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్‌ సంమ్‌ ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. దేశ వ్యాప్తంగా ఈనెల 18నుంచి 22వరకు కొనసాగిన ధర్నా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం…

హైదరాబాద్

శ్రీ లక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో అరెస్టై చంచల్‌ గూడ జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరుపు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

వార్తలు

సోనియాతో ముగిసిన సీఏం భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పార్లమెంటులో సంతకం చేశారు.

హైదరాబాద్

కాంగ్రెస్‌ అభ్యర్థిగానే చేస్తా: విశ్వరూవ్‌

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగానే పోటి చేస్తానని మంత్రి విశ్వరూవ్‌ స్పష్టం చేశారు. చంచల్‌గూడ జైలులో జగన్‌ను ఆయన కుమారుడు కలిసిన నేపథ్యంలో విశ్వరూవ్‌ చెబుతున్నాడని, అతన్ని నియంత్రిస్తానని విశ్‌వరూవ్‌ తెలిపారు.…

హైదరాబాద్

ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: ఇటీవల ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా త్రిమూర్తులు గెలుపొందిన విషయం తెలిసిందే. సభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ఇవాళ…

వార్తలు

ఎలిజబెత్‌కు జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు వార్షిక వేతనం 20శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు, ఎలిజబెత్‌ (85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈనెలతో 60ఏళ్లు…

వార్తలు

బోరు బావిలో చిన్నారి -పుట్టినరోజు నాడే విషాదం

గుర్గావ్‌: తల్లిదండ్రులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్న నాలుగేళ్ల చిన్నారి అదే రోజు బోరు బావిలో పడిపోయింది. హర్యానాలోని మానేసర్‌ పట్టణం సమీపంలో కషాన్‌ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి మహీ(4) బుధవారం…

వార్తలు

ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు నివేదిక

ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబందించి అధినేత్రి సోనియాతో సీఎం సమాలోచనలు జరుపుతున్నట్లు…

వార్తలు

పాక్‌ ప్రధాని అభ్యర్థిగా పర్వేజ్‌ అష్రఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ని పాకిస్థాన్‌ ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఈ రోజు సాయంత్రం ప్రధానిని ఎన్నుకుంటుంది. గిలానీ మంత్రివర్గంలో అష్రఫ్‌ నీరు, విద్యుత్‌ శాఖల మంత్రిగా చేశారు.