Saturday, 7 November 2026

July 2012

వార్తలు

ఆలస్యంగా బయలుదేరనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌: పట్టాలపై వర్షం నీరు నిలవడంతో సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ బయలుదేరే ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా బయలుదేరనుంది. పొద్దున 6.25కు బయలుదేరాల్సిన రైలు 11గంటలకు బయలుదేరనుందని రైల్వేవర్గాలు తెలిపాయి.

హైదరాబాద్

భారీ వర్షానికి కూలిన ప్రహారి గోడ..నలుగురి మృతి

హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున బాలానగర్‌ నర్సాపూర్‌ రహదారిలో పారిశ్రామిక వాడ ప్రహారిగోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

జిల్లా వార్తలు

డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం మూసాపేట వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న డీసీఎం వ్యాన్‌ను శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళుతున్న డీసీఎం వ్యాన్‌ మూసాపేట వద్ద రోడ్డుపై ఆగి ఉండగా అదేవైపు…

హైదరాబాద్

నగరంలో పలుప్రాంతలు జలమయం

హైదరాబాద్‌ : నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు నివాసిత ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది.ఉప్పగూడలోని శివాజినగర్‌, క్రాంతినగర్‌, ఉప్పల్‌లోని కావేరి నగర్‌, మలక్‌పేట్‌లోని శంకర్‌నగర్‌, ఎల్పీనగర్‌లోని గుంటిజంగయ్యకాలనీ, మీన్‌పేటలోని లెనిన్‌నగర్‌, ప్రశాంతి నగర్‌, గుర్రంగూడ, నాదర్‌గూల్‌  తదితర లోతుట్టు…

వార్తలు

మిజోరం బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

ఐజ్వాల్‌: మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు 100కి.మీ.దూరంలోని కెఫాంగ్‌ వద్ద బస్సు లోయలో పడటంతో 18 మంది ప్రయాణీకులు ప్రాయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఐజ్వాల్‌ సివిల్‌ ఆసుప్రతికి తరలించినట్టు పోలీసులు అన్నారు. ఇరుకుదారి…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

హైదరాబాద్‌: నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో పలు కాలనీలు జలమయం కావడం, నాలాలు పొంగిపొర్లడం, ట్రాఫిక్‌ ఇబ్బందులపై గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ అప్రమత్తమయింది. ఆయా జోన్లలో ఉన్న  డిప్యూటీ కమిషనర్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో…

హైదరాబాద్

హైదరాబాద్‌లో వర్షానికి 8 మంది మృతి

హైదరాబాద్‌: నగరంలో కురిసిన భారీ వర్షానికి వివిధప్రాంతాల్లో 8 మంది  ప్రాణాలు కోల్పోయారు. హఫీజ్‌పేటలోని అదిత్యనగర్‌లో గోడకూలి పోవడంతో తల్లి, ముగ్గురు పిల్ల్లలు మృతిచెందారు. మృతిలు ఫరిదాబేగం, మహమ్మద్‌ సమీర్‌, ముస్కాస్‌, సమరిస్‌లని స్థానికులు తెలిపారు. బాలానగర్‌ పారిశ్రమికవాడలో…

వార్తలు

ముంబయి పోలీసుల కస్టడీకి జుందాల్‌

ముంబయి: 26/11 ముంబయి దాడుల్లో కీలక నిందితుడిగా భావిస్తున్న అబుజుందాల్‌ను ముంబయి ఉగ్రవాద వ్యతిరేక దళం ఈ రోజు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనుంది. న్యూఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న జుందాల్‌ను ముంబయి పోలీసులకు విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీన్యాయస్థానం…

వార్తలు

లారీ బోల్తా డ్రైవర్‌,క్లీనర్‌ మృతి

పూసపాటిరేగ: విజయనగం జిల్లా పూసపాటిరేగ మండలంలో జాతీయ రహదారిపై కుప్పెర్ల సమీపంలో చంపాపతి వంతెనపై నుంచి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ వరమరాజు, క్లీనర్‌ మల్లేశ్వరరావులు మృతిచెందినట్లు పోలీసులు తెలియజేశారు. మృతులు విజయవాడకు చెందినవారుగా…

వార్తలు

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం:వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుంతోంది.బడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగాఅల్పడీన ద్రోణి కొనసాగుతోందిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశముంది.