July 2012
ఖాళీగా ఉన్న వర్శిటీ వీసీ పదవుల భర్తి :గవర్నర్
తిరుపతి:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ వీసీ పదవులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్ నరసింహన్ చెప్పారు.శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర పరిస్థితులు బాగున్నాయని తిరుమలలో నీటి సమస్యను అదిగమించడానికి ఉన్న అడ్డంకులు తొలగుతాయని వివరించారు.
ఒలింపిక్ క్రీడలకు రక్షణగా క్షిపణి సాంకేతికత వినియోగం
లండన్:ఒలింపిక్స్‌కి రక్షణగా బ్రిటన్ క్షిపణి సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తోంది.విమానాల దాడుల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి క్షిపణులను సిద్దంగా ఉంచుకోవాలని ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహరాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.అందుకుగాను ఒలింపిక్ పార్కు చుట్టూ మాత్రమే కాక సమీపంలోని నివాస భవనాల…
తోటి ఖైదీలపై మరో ఖైదీ దాడి: ఒకరు మృతి
హైదరాబాద్ : చర్లపల్లి జైలులో మంగళవారం అర్థరాత్రి ఓఖైదీ వీరంగం సృష్టించాడు. దాసరి నర్సింహులు అనే ఖైదీలపై కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటయ్య అనే ఖైదీ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. దాడిలో…
300 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కర్నూలు : కర్నూలు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని కొలిమిగుండ్ల పాలాల్లో దాచిపెట్టిన 300 ఎర్రచందనం దుంగలను బుధవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భార్యను హత్యచేసిన భర్త
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచీపెంట్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమెను నాలుగురోజుల క్రితం తన భర్తే హతమార్చి ఓ రేకుల షెడ్లో పడేసాడు. దుర్వాసన రావడంతో బుధవారం ఉదయం స్థానికులకు…
ఢిల్లీలోనూ తప్పని కరెంటు కోతలు
ఢిల్లీ:ఓ పక్క ఉక్కపోత…మరో పక్క కరెంటు కోత…ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.నగరంలో పలుచోట్ల ఏకంగా 8,9 గంటలపాటు కరెంటు ఉండడంలేదు.ఆఖనిరి వీఐపీల నివాసాలుండే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోనూ నాలుగు గంటలపాటు కరెంటుకోత తప్పడం లేదు.రుతుపవనాల రాక ఆలస్యమైనందువల్ల ఉత్తరాది…
అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలియజేశారు.
ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు
డీజీపీ నియామకంపై హైదరాబాద్:రాష్ట్ర డీజీపీ నియామకం పై క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ స్వీకరించింది.ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదికి వాయిదా వేసింది.డీజీపీ దినేష్‌రెడ్డి నియామకం పై నోట్‌ఫైల్…
రాజ్యంగ సంక్షోభం లేదు :కర్ణాటక గవర్నరు
బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుతం రాజ్యంగ సంక్షోభం ఏమీ నెలకొనలేదని గవర్నర్ హెచ్. ఆర్. భకధ్వాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు ఉపసంహరణ గురుంచి ముఖ్యమంత్రి సదానందగౌడ ఇప్పటికే తనను కలిసి మాట్లాడారని తెలిపారు. కరువు…

