Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినితీ పెరిగిపోయిందని ఆరోపించారు. వెనకబడిన కులాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ తరపున ఆపార్టీ   సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  నాయిని మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 66 సంవత్సరాలు అయినా…

జిల్లా వార్తలు

ముళ్లు వేసిన భర్తనే హత్య చేసిన భార్య

హైదరాబాద్‌: మూడు ముళ్లు వేసిన భర్తనే ఓ భార్య హత్య చేసింది. నిదిస్త్రున్న భర్తపై కిరోసిన్‌ పోసి నిప్పటించింది. ఈ ఘటన మూసాపేటలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియలేదు.

జిల్లా వార్తలు

స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలియజేశారు.

హైదరాబాద్

మండలి ఆవరణలో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని  ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

హైదరాబాద్

ముఖ్యమంత్రితో ధర్మాన భేటీ

హైదరాబాద్‌: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ధర్మానకు కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడే ధర్మాన మంత్రి గంటా శ్రీనివాసరావుతో కాసేపు భేటీ…

హైదరాబాద్

రాజధానిలో పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు పాల్పడనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌  పోలీసులు అప్రమత్తమయ్యారు. జంటనగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, నాంపెల్లి, సికింద్రబాద్‌ రైల్వేస్టేషన్‌లు, ఎంజీబీఎన్‌లో తనిఖీలు…

హైదరాబాద్

జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌: 66వ స్వాతంత్య్ర వినోత్సవం వేడుకల సందర్భంగా పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. మైదానంలో ఉన్న అమరవీరులు సైనిక స్తూపానికి నివాళులు ఆర్పించారు. ఈ కార్యాక్రమంలో డీజీపీ దినేష్‌రెడ్డి , మంత్రులు, ఎమ్మెల్యేలు…

హైదరాబాద్

పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిధిలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు.

వార్తలు

మహాత్మ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ: 66వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ఈ ఉదయం నివాళులర్పించారు. అనంతరం ప్రధాని ఎర్రకోటకు బయలుదేరారు.