Thursday, 5 November 2026

August 2012

హైదరాబాద్

పోలీస్‌ స్టేషన్‌ ముందు టీవీ ఆర్టిస్టుల ధర్నా

హైదరాబాద్‌: సీరియల్‌ చిత్రీకరణ చేస్తుండగా పోలీసులు కెమెరా లాక్కెళ్లారంటూ బుల్లితెర ఆర్టిస్టులు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేశారు.  ఈ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పుప్పాలగూడలో అక్కాచెల్లెళ్లు సీరియల్‌ చిత్రీకరిస్తుండగా స్థానికుల ఫిర్యాదుపై పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ అడ్డుకుని…

హైదరాబాద్

ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు ఫీజుల పెంపు గందరగోళంతో తాము అండర్‌ టేకింగ్‌ పత్రాలను అందించలేకపోయాని గడువు కావాలని కళాశాలలు కోరటంతో ఈ నిర్ణయం…

హైదరాబాద్

ప్రపంచ తెలుగు మహాసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నాం-త్వరలో లోగో ఆవిష్కరణ-వట్టి

హైదరాబాద్‌:  ప్రపంచ తెలుగు మహీసభలకు 25కోట్లు వెచ్చిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ తెలిపారు. తెలుగు మహా సభల ముఖద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరత్వరగా పనులు పూర్తి చేస్తున్నామని ఐదువేలకు పైగా ప్రవాసభారతీయులు హాజరవుతారని త్వరలో ముఖ్యమంత్రి లోగో…

వార్తలు

కొండరాళ్లు విరిగిపడి 4 ఇళ్లు ధ్వంసం

మొగల్రాజపురం: కొండరాళ్లు దొర్లిపడి స్ధానిక ఆరవ డివిజన్‌లో బ్రహ్మానందరెడ్డినగర్‌లో నాలుగు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. తెదేపా నాయకుడు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌ సంఘటనస్థలాన్ని పరిశీలించారు.

హైదరాబాద్

చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: విద్యాసాగరరావు

హైదరాబాద్‌: సరిహద్దు ప్రాంతాలనుంచి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠినచర్యలు తీసుకోనంతకాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని కేంద్ర హోంశాఖ మాజీ సహాయమంత్రి సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ అస్సాంలో అల్లర్లను అదుపుచేయటంలో…

వార్తలు

తుంగభద్రలో నిన్న కర్నాటక రైతులు మూసివేసిన షట్టర్లను తెరిచిన పోలీసులు

కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ 33వ డీసీ వద్ద కర్నాటక రైతులు నిన్న మూసివేసిన షట్టర్లను పోలీసులు తెలిపించారు. ఇక్కడ మొత్తం 6గేట్లలో 5గేట్లను మూసివేసి నీటిని తమ రాష్ట్రానికి తరలించారు. ఈ ప్రాంత రైతులు ఆందోళన చేయటంతో…

వార్తలు

వైద్యశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ సప్పెండ్‌

నెల్లూరు: జిల్లాలోని సీతారాంపూర్‌ లోని ప్రాథమిక వైద్యశాలను జిల్లా వైద్యధికారి మాచీలిమణి తనిఖీ చేశారు. విధులకు గత కొన్ని రోజులుగా హాజరుకానిజూనియర్‌ అసిస్టెంట్‌ కార్తిక్‌ను సస్పెండ్‌ చేశారు. విధుల్లోలేని వైద్యధికారి శ్రీనివాసులు రెడ్డి, ఫార్మసిస్టు దిలిప్‌లకు మెమోలు జారీ…

వార్తలు

అండర్‌-19 ప్రపంచకవ్‌ సెమీఫైనల్స్‌కు చేరిన భారత్‌

ఆస్ట్రేలియాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌పోటీల్లో భారత్‌ సెమీ ఫైనల్స్‌కు చేరింది. ఈ రోజు జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో భారత్‌ విజయం సాధించింది. పాక్‌ జట్టు 136 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత్‌…

హైదరాబాద్

ప్రేమ్‌ ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శంషాబాద్‌ సమీపంలోని గగన్‌పహాడ్‌ వద్ద ప్రేమ్‌ ప్లాస్టిక్‌ కంపెనీలో ఈ రోజు అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

వార్తలు

కృష్ణా డెల్టాలో పంటను కాపాడేందుకు చర్యలు: లగడపాటి

విజయవాడ: కృష్ణా డెల్టాలో పంటను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. దీంతో ఈ ఏడాది తప్పకుండా అత్యధిక దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాగర్‌నుంచి నీటి విడుదతకు ఆటంకంగా…