Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

తులసీ ప్రజాపతి నకిలీ ఎదురుకాల్పుల కేసుకు సీబీఐ ఛార్జిషీట్‌ దాకలు

అహ్మదాబాద్‌: తులసీ ప్రజాపతి నకిలీ ఎదురుకాల్పుల కేసుకు (2006) సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారమిక్కడి ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జీషీట్‌ దాఖలు చేసింది. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సన్నిహితుడు, మాజీ హోం మంత్రి అమిత్‌షా సహా మొత్తం…

వార్తలు

ఐబీఎఫ్‌ ఆధ్యక్షుడిగా మన్‌జిత్‌ సింగ్‌

ముంబయి: ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ (ఐబీఎఫ్‌) అధ్యక్షుడిగా మల్టీ స్క్రీన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో మన్‌జిత్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సునిల్‌ లుల్లా (టైమ్స్‌ టీవీ నెట్‌వర్క్‌), రజత్‌శర్మ (ఇండియా టీవీ), పునిత్‌ గోయెంకా (జీ న్యూస్‌)…

వార్తలు

శ్రీలంక విజయలక్ష్యం 130

క్వాండీ: పల్లేకల ఇంటర్నేషన్‌ స్టేడియంలో టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా శామ్యూల్స్‌…

వార్తలు

డీజీపీగా దినేశ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం యూపీఎస్సీకి పంపిన మూడు పేర్లలో డీజీపీగా దినేశ్‌రెడ్డి పేరు ఖరారైంది. ఆయనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉన్న నేపథ్యంలో డీజీపీగా దినేశ్‌రెడ్డికే అవకాశం దక్కింది. ఇక ఆయన పూర్తికాలపు డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

వార్తలు

రేపు నగరంలో ర్యాలీలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు మద్దతుగా రేపు నగరంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరనగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూడెమోక్రసీ కార్యకర్తల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ వద్ద నుంచి, అక్కడి నుంచే 1.30కి తెలంగాణ జాగృతి కార్యకర్తల ర్యాలీ, విద్యుత్తు…

వార్తలు

రేపు కవాతుకు ఇందిరాపార్క్‌ నుంచి ర్యాలీ

హైదరాబాద్‌: రేపు ఇందిరాపార్క్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఐ నేత నారాయణ తెలిపారు. తెలంగాణ కవాతులో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వార్తలు

కవాతులో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది: భాజపా

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు (సాగర హారం)లో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని భాజపా పేర్కొంది. ఐకాస నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కవాతుగా మార్చాలనుకుంటోదని ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని…

వార్తలు

కవాతు నేపథ్యంలో సినిమా థియేటర్లు బంద్‌

హైదరాబాద్‌: రాజధానిలో ఆదివారం జరగనున్న కవాతు నేపథ్యంలో అన్ని సినిమా థియేటర్లు మూసివేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ నిర్ణయించింది. దీంతో ఆదివారం నగరంలో థియేటర్లు మూతపడనున్నాయి.

వార్తలు

ఆజాద్‌తో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో శనివారం భేటీ అయ్యారు. రేపటి కవాతు నేపథ్యంలో వీరి మధ్య తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది.