Friday, 6 November 2026

September 2012

వార్తలు

గ్యాటిమాలలో బద్దలైన ఆగ్నిపర్వతం

గ్యాటిమాల: మెక్సికో సరిహద్దు గ్వాటిమాలలోని పర్యాటక కేంద్రం సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో  3కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పరిసర ప్రాంతాల్లోకి లావా ప్రవహిస్తుండటంతో సుమారు 33 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలివేళ్లాల్సిందిగా అధికారులు…

జిల్లా వార్తలు

సాంకేతిక లోపంతో నిలిచిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. గంటకుపైగా రైలును నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

హైదరాబాద్

నేడు కరీంనగర్‌ జిల్లాలో గవర్నర్‌ పర్యటన

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ నేడు కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి హుజూరాబాద్‌ చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన సేవలను పరిశీలిస్తారు. అనంతరం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో…

వార్తలు

నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి శుక్రవారం సాయంత్రం భేటీ కానుంది. విమానయాన రంగం సహా పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

హైదరాబాద్

డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా ఆందోళనలు

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు పెంపు, గ్యాస్‌ సిలిండర్ల వాడకం పరిమిత నిర్ణయాలపై విపక్షాలు అగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్త ఆంందోళనలకు భాజపా,సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి. కేంద్ర వైఖరికి నిరసనగా సీపీఐ నేడు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనుంది. నేడు, రేపు…

ఖమ్మం

విద్యుత్‌ ఉప కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఖమ్మం: ఏటపాక విద్యుత్‌ ఉప కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలనికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో జిల్లాలోని 8 మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రమాదానికి కారణాలు…

వార్తలు

3 ఇసుక లారీల పట్టివేత

కంచికచర్ల: కృష్ణ జిల్లా కంచికచర్ల మండలంలోని చౌటికల్‌ వద్ద కృష్ణా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వీటిని కంచికచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించి కేసులు నమోదు చేయనున్నట్లు తహసీల్దార్‌ విక్టర్‌బాబు…

వార్తలు

రూ.1.5 లక్షల ఎర్ర చందనం స్వాధీనం

సిద్ధవటం: అక్రమంగా తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను కడప జిల్లా సిద్ధవటం మండలం బాగ్రాపేట్‌ చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దుంగలను లారీలో రాజంపేట నుంచి కడపకు తరలిస్తున్నట్లు చెప్పారు, వీటి విలువ సుమారు రూ.1.5 లక్షలు…

వార్తలు

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 320 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 90 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

వార్తలు

నేటి నుంచి పశ్చిమబెంగాల్‌లో ప్రణబ్‌ పర్యటన

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేటి నుంచి నాలుగు రోజులపాటు తన సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైమండ్‌ జూబ్లీ ఉత్సవాలు, హౌరాలో సాంజీబస్‌ ఆసుపత్రి ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు…