Wednesday, 4 November 2026

January 2013

హైదరాబాద్

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వామపక్షాల ఆందోళన

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనబాట పట్టాయి. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద సీపీఐ, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. ప్రజలపై పెనుభారం…

హైదరాబాద్

పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కోరుతూ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు యత్నించారు. ఈ ఉదయం పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు తెలంగాణకు అనుకూల నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.…

సీమాంధ్ర

పౌరహక్కుల నేత చంద్రశేఖర్‌ కన్నుమూత

గుంటూరు : చుండూరు కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పౌరహక్కుల నేత బి. చంద్రశేఖర్‌ ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. ఆయన మృతికి మంత్రి డొక్కా మాణాక్యవరప్రసాద్‌ సంతాపం తెలిపారు.

వార్తలు

ఇండోనేసియాలో భూకంపం : చిన్నారి మృతి

బాందాఅచెలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌సౌ దీని తీవ్రత 6గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని బాందా అచెకు 15 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు.

జాతీయం

ప్రధాని, ఆజాద్‌, వయలార్‌తో భేటీ కానున్న సీమాంధ్ర నేతలు

న్యూఢిల్లీ: ఇరు ప్రాంతాల నేతలు ఢిల్లీ చేరడంతో రాష్ట్రరాజకీయాలు దేశరాజధానిలో వేడెక్కాయి. నిన్న పలువరు కాంగ్రెస్‌ నేతలను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈరోజు కూడా ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పరిశీలకులు…

ఆదిలాబాద్

నిర్మల్‌ న్యాయస్థానానికి అక్బరుద్దీన్‌ తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో ఆయన్ను ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు.

జాతీయం

షింగేతో భేటీ కానున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

న్యూఢిల్లీ : అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ ఉదయం 11 గంటలకు హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలవనున్నారు. నిన్న షిండేను సీమాంధ్ర నేతలు కలిసిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై…

కరీంనగర్

భార్య, కూతురి గొంతుకోసి హత్య చేసిన భర్త

ఎల్లారెడ్డిపేల : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య, చిన్నారి గొంతుకోసి దారుణంగా హత్య చేసి పర్యారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

మద్యం మత్తులో సంపులో పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌: కుషాయిగూడలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు సంపులో పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా .. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని బయటకి తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.