Wednesday, 4 November 2026

2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ప్రదానం బోయినపల్లి,ఎల్లారెడ్డిపేట్,గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లు
జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు 2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు.ఇందులో జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు
ఉత్తమ స్థానంలో నిలిచాయి.కేటగిరి-1 లో గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ 65.38 పాయింట్స్ తో.,కేటగిరి-2 బోయినపల్లి 78.23 పాయింట్స్ తో కేటగిరి-3 లో ఎల్లారెడ్డిపేట్ 75.59 పాయింట్స్ తో జిల్లాలో మొదటి స్థానాలలో నిలిచాయి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అలాగే అదనపు ఎస్పీ చంద్రయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా లో ఉత్తమ పోలీస్ స్టేషన్లు గా ఎంపికైన పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ లు అభిలాష్, మహేష్,శేఖర్ లను అభినందించి వారిని సన్మానించి అవార్డులు అందజేశారు.