Wednesday, 4 November 2026

వ్యవసాయం విద్యా వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి.

 

నేరేడుచర్ల (జనం సాక్షి) న్యూస్.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంచనా బడ్జెట్ నుసవరించి సంక్షేమ రంగానికి వ్యవసాయరంగానికి విద్య వైద్యం రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్రావు కొదమగుండ్ల నగేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం అఖిల భారత కమిటీలుపిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ కేంద్రం దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2022. 2023సంవత్సరాల్లో ఉపాధి హామీకి రెండులక్షల యాభై కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉండగా కేవలం డెబ్బై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని భవిష్యత్తులో ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ యోచన ఉన్నట్టు వారన్నారు,వ్యవసాయ రంగానికి ఒక లక్షా ఆరువేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని అట్లాగే దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు తక్కువ కేటాయించా రాన్నారు,కార్పోరేట్లు నుండి గతంలో పన్నెండు శాతం పన్ను వసూలు చేయగా ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఈ బడ్జెట్లో కేవలం ఏడు శాతం మాత్రమే వారి నుండి పన్ను వసూలు చేయాలన్న నిర్ణయంతో ఇది పేదల బడ్జెట్ కాదు కార్పోరేట్లు పెట్టుబడిదారీ ప్రభుత్వం ఉంది తప్ప పేదల ప్రభుత్వంగా లేదని, వారు అన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వరంగ సంస్థల్ని మొత్తం ప్రైవేటీకరించాలని చూస్తుందని ఎల్ఐసీ బొగ్గు విశాఖ ఉక్కు ప్రభుత్వరంగ సంస్థల్ని మొత్తం ప్రైవేటీకరించి దేశంలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది అని వెంటనే కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన అంచనా బడ్జెట్ను సవరించి సంక్షేమ రంగానికి పేదలకు ప్రజలకు రైతాంగానికి కార్మికులకు కర్షకులఅభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాలని లేని యెడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు యడ్ల సైదులు,నీలా రామ్మూర్తి,తిరుపతయ్య,మీనయ్య పాతూరి శ్రీనివాస్,సట్టు శ్రీను, వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు