23న నిర్వహించనున్న డ్రోన్ ప్రదర్శన 28 కి వాయిదా జిల్లా కలెక్టర్ జి.రవికుమార్
నేర రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్షపడాలని , అందుకు కోర్టు కానిస్టేబుల్ పాత్ర ఎంతో కీలకమని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు . శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిడిపిఓ , కోర్టు లైసన్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం జరిగింది . ఈ సందర్భంగా ఎస్పీ కే నరసింహ మాట్లాడుతూనేరస్తులకు కోర్టులో శిక్ష పడాలంటే కోర్టు కానిస్టేబుల్ ఎంతో శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు కానిస్టేబుల్ ప్రత్యేక శ్రద్ద, బాధ్యత తీసుకోవాలని సూచించారు . కోర్టు కు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలని. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు లో డిపాజిట్ చేయాలి అన్నారు . కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని , నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని , కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు పాటించాలని అన్నారు . కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో ( కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్) లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. కోర్టు లో ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేసినచో పెండింగ్ లేకుండా వుంటుందని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ఎస్పీ సూచించారు .
ఈ కార్యక్రమంలో డీ.ఎస్.పి వెంకట రమణ రెడ్డి, ఇన్స్పెక్టర్ బషీర్ , కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్స్ , కోర్టు కానిస్టేబుళ్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.