23న ప్రధానోపాధ్యాయుల అత్యవసర సమావేశం

ఆదిలాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని కాగజ్‌నగర్‌, మంచిర్యాల డివిజన్ల ప్రధానోపాధ్యాయుల అత్యవసర
సమావేశాలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కాగజ్‌ నగర్‌ డివిజన్‌ వారికి అక్కడి బాలవిద్యా మందిర్‌లో, మంచిర్యాల్‌ డివిజన్‌ వారికి మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆర్‌ఎంఎన్‌ఏ నిధుల వార్షిక ప్రణాళిక తయారీపై ఈ సమావేశం ఉంటుందని వెల్లడించారు. సమావేశానికి వచ్చేటపుడు 2011-12కి సంబంధించిన రూ.50 వేల వార్షిక వినియోగ పత్రాలను వెంట తప్పక తీసుకురావాలని సూచించారు.