బీజేపీ నేతల అక్రమ అరెస్ట్
-తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర నాయకులు బి. కృష్ణ
వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 16 (జనం సాక్షి)సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటారని
బిజెపి నాయకులను ముందస్తు అక్రమ అరెస్టు
చేయడాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టు లకు బయపడమని, కేసీఆర్ ప్రభుత్వంలో మీటింగ్ కొరకు విద్యాసంస్థల సెలవు ప్రకటించి ప్రైవేటు స్కూల్ బస్సులను వాడుకోవాడం దుర్మార్గమైన స్థితి చూస్తామని మనం అనుకోలేదని, కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి నైజం నిరంకుశ పాలన కొనసాగుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ అన్నారు. .బిజెపి జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి పరశురాం బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము లును అరెస్ట్ చేసి పట్టణ పోలీసు స్టేషన్ లో ఉంచారు