Tuesday, 3 November 2026

26న వైఎస్సార్‌సీపీలో చేరిక

కొణిజర్ల : కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదావత్ సైదులు నాయక్ శనివారం కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. గిరిజన గ్రామం నుంచి సర్పంచ్‌గా గెలిచిన తాను కాంగ్రెస్ బలోపేతానికి చేసిన కృషి చేశానన్నారు. దీన్ని గుర్తించి పార్టీ మండల అధ్యక్షులుగా నియమించారన్నారు.

ఒక గిరిజనుడికి అధ్యక్ష పదవి ఇవ్వడమేమిటంటూ కొందరు ఓర్వలేక తనను ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అధ్యక్షుడి ప్రమేయం లేకుం డానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, స్థానిక సంస్థలత ఎన్నికల్లో తనకు చెప్పకుండానే పార్టీ టికెట్లను అనామకులకు కట్టబెట్టడం లాంటి ప్రమాణాలు చోటుచేసుకున్నాయన్నారు.

దీంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందన్నారు. అయినా గుణపాఠంనేర్వని ఆ నాయకులు తనకు కనీస మర్యాద పాటించడం లేదన్నారు. దీంతో మనస్తాపం చెందిన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. సైదులు నాయక్‌తోపాటు  పార్టీ మండల సహాయ కార్యదర్శి గుడివాడ వెంకటేశ్వ ర్లు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

26న వైఎస్సార్‌సీపీలో చేరిక

ఈనెల 26న నల్లగొండ జిల్లా సూర్యాపేటలో షర్మిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు సైదులు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యంలో తీర్థం పుచ్చుకోనున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డితోనే వైరా నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో గుడివాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *