నినాదాలు తెలుపుతూ వీఆర్ఏల దీక్షా….
వెంకటాపూర్(రామప్ప)ఆగస్ట్19(జనం సాక్షి):-
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో వెంకటాపూర్ మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు పే స్కేల్ జీవోను మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని 2020 సెప్టెంబర్ 9 మరియు 2022 మార్చి 18 తేదీనకూడా అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది ఇట్టి హామీని నెరవేర్చి జీవోను విడుదల చేసేంతవరకు ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం.శుక్రవారం రోజున ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 26వ రోజుకు చేరింది.
ఇట్టి సమ్మె వెంకటాపూర్ మండలంలో వీఆర్ఏల నిరవధిక దీక్ష శిభిరం వద్ద ఈరోజు కార్యచరణ కార్యక్రమంలో నినాదాలు చేస్తూ 26వ రోజు నిరసనలు తెలియజేయునది.
మండల ప్రధాన కార్యదర్శి మంతెన స్వప్న మాట్లాడుతూ తెలంగాణ వీఆర్ఏల కోరికలు న్యాయమైనవి వీరి డిమాండ్స్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసినారు.ఇట్టి 26వ రోజు నిరవధిక సమ్మె నిరసనలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజయ్య వెంకటాపూర్ మండలం వీఆర్ఏల మండల అధ్యక్షులు నక్క శశి కుమార్ ఉపాధ్యక్షులు తొగరు మురళి సరిత స్వప్న కిషన్ శంకర్ సునీత శ్రీనాథ్ మొగిలి కుమారస్వామి సమ్మక్క బిక్షపతి రాజమౌళి కిరణ్ రాయ మల్లు మరియు మండల వీఆర్ఏలు అందరూ పాల్గొనడం జ




