Thursday, 5 November 2026

విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ

ఫోటో రైటప్: నోటుబుక్కులు పంపిణీ చేస్తున్న ఎస్సై రాజశేఖర్.
బెల్లంపల్లి, ఆగస్టు19, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జంగాల్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నెన్నెల ఎస్సై రాజశేఖర్ చేతుల మీదుగా 50 మంది విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సత్యసాయి సేవాసమితి సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని, ప్రతి సందర్భంలో సేవా కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటున్నారని, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేయాలని అభిలాషించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేశం, సర్పంచ్ రావుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ చిలుకయ్య, సత్యసాయి సేవాసమితి కన్వీనర్ సేని వెంకన్న, సభ్యులు భీమయ్య,

 

శకుంతల, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.