Wednesday, 4 November 2026

3 వ మహాసభలకు తరలిన టేకులపల్లి సిపిఐ నాయకులు

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జలం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగే మూడవ మహాసభలకు టేకులపల్లి మండలం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి మండల సమితి ఆధ్వర్యంలో ఆదివారం బస్సు ద్వారా బయలుదేరారు.ఈ మహాసభలకు బయలుదేరిన వారిలో సిపిఐ పార్టీ జిల్లా నాయకులు గూగులోతు రాంచందర్,మండల సహాయ కార్యదర్శి ఎజ్జు భాస్కర్, గుగులోతు శ్రీను, వాసం భద్రయ్య, బానోతు వీరన్న ,కర్లపూడి సుందర్ పాల్, బండి వీరభద్రం, తేజావత్ మధు, వి సతీష్, తేజావత్ లక్ష్మణ్ ,మండల కార్యవర్గం సభ్యులు బయలుదేరి వెళ్లారు.