Thursday, 5 November 2026

31 వరకు ఓటరు నమోదుకు అవకాశం

జనగామ,మే23(జ‌నం సాక్షి): జిల్లాలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలలో ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌  తెలిపారు. 21వ తేదీ నుంచి మొదలైన కార్యక్రమం  31 వరకు అన్ని గ్రామాల్లో బూత్‌ లెవల్‌ అధికారులు అందుబాటులో ఉండి డోర్‌ టు డోర్‌ పరిశీలన చేస్తారని అన్నారు. , ఈ కార్యక్రమంలోఅర్హులైన నమోదు కాని ఓటర్లను గుర్తించి వారిని నమోదు చేయిస్తారని తెలిపారు. అదేవిధంగా మృతి చెందిన లేదా శాశ్వత వలస పోయిన వ్యక్తుల వివరాలు విచారణ చేసి తొలగిస్తారని తెలిపారు.  జిల్లాలో ప్రజలంతా ఓటరు నమోదు, మార్పులు , తొలగింపుల ఫారాలు సంబంధిత బూత్‌ లెవల్‌ అధికారి పరిశీలనకు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రత్యేకించి 18-21 సంవత్సరాల వయసున్న యువ ఓటర్లు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.