Thursday, 5 November 2026

41వ రీజినల్ లెవెల్ డాక్ అదాలత్.

ములుగు,సెప్టెంబర్27(జనం సాక్షి):-
తపాల సేవలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులు మరియు సలహాలను  వినడానికి 41వ డాక్ అదాలత్ పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్, హైదరాబాదు 500001 చే నిర్వహించబడుతుంది.డాక్ అదాలత్ యొక్క తేదీ 10 అక్టోబర్ 2022 న
సమయం ఉదయం 11 గంటలకు
(వీడియో కాన్ఫరెన్స్, గూగుల్ మీట్  ద్వారా)
ఫిర్యాదుల స్వీకరించు చివరి తేదీ.30 సెప్టెంబర్ 2022 వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్,జనగామ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు మరియు సిద్దిపేట జిల్లాల నుండి ప్రజల ఫిర్యాదులు పంపవలసిన చిరునామా జే. శ్రీనివాస్.అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాఫ్ & విజిలెన్స్) పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం హైదరాబాద్ రీజియన్, హైదరాబాదు 500001.లెటర్లు మరియు కవరులను 41 డాక్ అదాలత్ అనే పదాలతో సూపర్ స్క్రైబ్ చేయాలనీ బి. నంద తపాల సూపరిండెంట్,
హనుమకొండ డివిజన్ తెలిపారు.