44వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గం పహాడ్ మండలం లో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 44వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు దీక్షలో కే వి రమణ, ముదిగొండ వేంకటేశ్వర్లు, పిట్టల వెంకన్న, రాజేశ్వర్ రెడ్డి, గ్యాస్ రమేష్, శనగ గోపయ్య, మారపాక ముత్తమ్మ , కొవ్వాల వెంకటమ్మ, కొమ్ము పాపయ్య, ఇసంపల్లి నరహరి తదితరులు పాల్గొన్నారు.