Tuesday, 3 November 2026

47 మంది మందుబాబులు అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెం 12లో శనివారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన 15 కార్లు, ఏడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కూకట్పల్లి పరిధిలోని 15 మంది మందుబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా 13 ద్విచక్రవాహనాలు, ఓ కారు, ఓ ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ సర్కిల్ పరిధిలో అయ్యప్ప సొసైటీ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని కోర్టులో హాజరుపరిచి… కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *