*55 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా*
ఉండవల్లి,సెప్టెంబర్ 17(జనంసాక్షి)::
డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు శనివారం తో 55 వ రోజుకు చేరాయి. మంగళవారం వీఆర్ఏలతొ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచి మళ్లీ రెండవసారి చర్చిద్దాం అని తెలిపారని అంతవరకు తాము శాంతియుతంగానే ధర్నా చేస్తామని వీఆర్ఏలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు, కో కన్వీనర్ షేక్షావలి, నారాయణ, కృష్ణ, నాగవేణి, జహాదా, గజేంద్ర గౌడ్, యాదగిరి జమీలాభి, బాబు తదితరులు పాల్గొన్నారు.
Attachments area