56వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏలు.

మునగాల, సెప్టెంబర్18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని మునగాల మండల వీఆర్ఏలు ఆదివారం 56వ రోజు నిరవధిక సమ్మెలో తెలియజేశారు. ఇందులో భాగంగా మండల విఆర్ఏలు తమ డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమింపబోమని స్పష్టం చేశారు. మునగాల మండల వీఆర్ఏల జేఏసి చైర్మన్ గట్టు ఉపేందర్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు శేఖర్, వెంకట్, నరేష్, ఖాసీం తదితరులు పాల్గొన్నారు.