Tuesday, 3 November 2026

59 జీవో దరఖాస్తుల పరిశీలించిన ఆర్డీవో.

క్షేత్ర స్థాయిలో దరఖాస్తులు పరిశీలిస్తున్న ఆర్డీవో.
వేమనపల్లి,సెప్టెంబర్27(జనంసాక్షి)
59 జీవో కింద చేసుకున్న దరఖాస్తులను మంగళవారం బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా 28 దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను క్రమబద్ధీకరణకు మంజూరు చేస్తామని ఆమె వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ రాజ్ కుమార్, సర్వే టీం సభ్యులు హమీద్ అహ్మద్, లక్ష్మీ రాజయ్య, సర్వేయర్ నాగరాజు ఉన్నారు.