6వ తేదీ నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీలో బీసీల సమస్యలను చర్చించాలి

జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ. జనం సాక్షి
ఈ నెల 6వ తేదీ నుంచి జరిగే శాసనసభ వర్షాకాల సమావేశాలలో బీసీల సమస్యలు చర్చించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర అసెంబ్లీలో బీసీ మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టేనని అన్నారు.గత ఆరు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు పెండింగ్లో ఉన్నాయని రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని జిల్లా కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంబిసి కార్పొరేషన్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.ఐఐటి,ఐఐఎం,ఎన్ఐటి మరియు ఇంజనీరింగ్ తదితర కోర్సులలో చదివే బీసీ విద్యార్థులకు ర్యాంక్ లతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు లు చెల్లించాలి.