హైదరాబాద్,(జనంసాక్షి): సీపీఐ రాష్ట్ర కర్యాదర్శి నారాయణ గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా గుడివాకలంకలో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని నారాయణ ఫిర్యాదు చేశారు. వేలంపాట, ధన ప్రభావం, అధికార దుర్వినియోగంతోనే పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని ఆయన పేర్కొన్పారు.




