హైదరాబాద్,(జనంసాక్షి): ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు జయదేవ్‌నాయుడు నియమితులయ్యారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో జయదేవ్‌కు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. జయదేవ్ నియామకంతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని బొత్స విశ్వాసం వ్యక్తం చేశారు.




