హైదరాబాద్,(జనంసాక్షి): జంట నగరాల్లో జరుగుతున్న పార్కుల కబ్జాలను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన జీహెచ్ఎంసీలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకు అక్కడి నుంచి కదలనంటూ అక్కడే భైఠాయించారు. దీంతో అక్కడ కొంత ఉధ్రిక్తత ఏర్పడింది.




