భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం: సీపీ
హైదరాబాద్: రేపు గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ నగర పోలీసులు కమిషనర్ అనురాగ్ శర్మ విలేకరులకు వివరించారు. పదిహేను వేలమంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రధాన కూడళ్లలో ఎనిమిది వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా 32 బాంబు స్క్వాడ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. పౌరులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కోన్నారు. పాత రౌడీషీటర్లపై బైండ్‌వోవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



