సకల జనుల భేరీకీ భారీగా తరలిరండి :టీఆర్‌ఎస్‌ ఆధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సకల జనుల భేరీకి టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు.ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జనుల భేరీని తెలంగాణ ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలిపారు. సకల జనుల భేరీని విజయవంతం చేయడం కోసం పార్టీ తరుపున నలుగురు ఇంచార్జులను నియమిస్తున్నామని కేసీఆర్‌ ప్రకటించారు.

తాజావార్తలు