తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయండి
మొయిలీని కలిసిన టీ కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని కోరారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజన ర్సింహా, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్ర మార్క, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సునీతాల క్ష్మారెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటర మణారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు మొయిలీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని హైక మాండ్ దృష్టికి ప్రజల ఆక్షాంను తీసుకెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియ ర్ నేతలు అధిష్టాన పెద్దల తో సంప్రదింపులు జరు పుతున్నారు. అధినేత్రి సోనియా, ప్రధాని మన్మో హన్‌సింగ్ సహా ఇతర పెద్దలను కలిసేందుకు అపా యింట్మెంట్ల కోసం వారు యత్నిస్తున్నారు. వారికి అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు ఎంపీల యత్నిస్తున్నారు. అలాగే కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ప్రక్రియను వేగిర పరచాలని కోరనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీ కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ తీర్మానా నికి కట్టుబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తు న్నారని, సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమం తో తెలంగాణవాదాన్ని పోల్చిచూడవద్దని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజలది అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కొందరి ప్రయోజనాల కోసం చేస్తున్నది మొయిలీకి వివరించామన్నారు. అధిష్టానం పెద్దలతో భేటీ అయి సీడబ్ల్యూసీ తీర్మానం అమలుకు ఒత్తిడి తెస్తామని తెలిపారు.