నవంబర్‌ నెలాఖరులోగా అసెంబ్లీకి బిల్లు రావాలి : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఈ నెలాఖరులోగా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాకపోతే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఆంధ్ర నేతల నోట్ల కట్టలకు క్యాబినెట్‌ నోట్‌ ఆగిందా అన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. వచ్చే వారంలోగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్‌ నోట్‌ తీసుకుచ్చి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందన్నారు. ఇవాళ గాంధీ జయంతి పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఇతర నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తాజావార్తలు