తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : కాకా
హైదరాబాద్ : నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి అన్నారు. తెలంగాణ నోట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాలతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరగా ముగించాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలు ఎందరూ అడ్డుకున్న తెలంగాణ ఆగదని స్పష్టం చేశారు. విభజన ప్రకటనతో తెలంగాణ గ్రామాల్లో అంధకారం తొలిగిందని ఆయన అన్నారు.



