్‌సోదరుడితో ప్రాణభయం ఉంది : వైకాపా నేత ఆర్కె రోజా
హైదరాబాద్ : డబ్బుల కోసం తన సోదరుడు వై. రామ్‌ప్రసాద్‌రెడ్డి ,అతని మేనేజర్ ప్రసాదరాజు తనను వేధిస్తున్నారని ,వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని సినీనటి,వైకాపా నేత ఆర్కె రోజా శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 22ఏళ్ల సినమా కేరీర్‌లో సంపాదించినదంతా రామ్‌ప్రసాద్‌రెడ్డి దేచేసి తనను నడిరోడ్డుపై వదిలేశాడని ఆరోపించారు.ప్రస్తుతం అతను ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడని అందులోంచి బయట పడేందుకు తనను వేధిస్తున్నట్లుగా ఉందని ఆమె పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ప్రచారం చేస్తామంటూ తన సోదరుడు ,ప్రసాదరాజు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. గురువారం వారిద్దరూ పంచవటి కాలనీలోని తన ఇంటికి వచ్చి భయపెట్టారని ,ఆ ఇద్దరిపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు రామ్‌ప్రసాద్‌రెడ్డి, ప్రసాదరాజులపై కేసు నమోదు చేశారు.




