క్యాబిన్‌లో చిక్కుకున్న రైలు డ్రైవర్‌ క్షేమం

హైదరాబాద్‌ : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రెండో నంబర్‌ ప్లాట్‌పారం పై చోటుచేసుకున్న ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ రైలు క్యాబిన్‌లో చిక్కుకున్న రైలు డ్రైవర్‌ ను రైల్వే సహాయక సిబ్బంది కాపాడారు. లింగంపెల్లి నుంచి నాంపల్లి వచ్చే ఎంఎంటీఎస్‌ డెడ్‌ఎండ్‌ను ఢీకోని నిలిచిపోయింది. కొన్ని బోగీలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ ఇంజిన్‌ పూర్తిగా దెబ్బతింది. క్యాబిన్‌లో చిక్కుకుపోయి గాయపడిన రైలు డ్రైవర్‌ను సికింద్రాబాద్‌ లాలాగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం ఎస్‌.కె మిశ్రా పరిశీలించారు. వేగాన్ని నియంత్రించలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు ఎస్‌. కె మిశ్రా తెలిపారు.

తాజావార్తలు