హైదరాబాద్ : రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీచేసిన సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానియామక పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలన్న డిమాండ్‌తో ఈ నెల 31న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసాన్ని ముట్టడించనున్నట్లు ఎస్‌ఐ సెలెక్టెడ్ అభ్యర్థుల సంఘం కన్వీనర్ సురేష్ తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తీర్మానించారు.బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత కారణంగా సెలెక్షన్ జాబితా ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోదందన్నారు.




