హైదరాబాద్ : తిరుమలలో భరీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా తేలికపాటిగా కురుస్తున్న వర్షం ఈ ఉదయం నుంచి భారీగా కురుస్తోంది. మరోవైపు ఈదురుగాలులు భారీగా వీస్తుండడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేకువజామున స్వామివారి ఆర్జీత సేవలకు సమయానికి భక్తులు హాజరుకాలేకపోయారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయం నుంచి తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు.




