హైదరాబాద్ : ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణలో భారీగా పంటనష్టం సంభవించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. వేలాది ఎకరాల్లో పంటలు మునిగాయని పేర్కొన్నారు.పైలిన్ తుపాన్ టైంలో స్పందించినట్లుగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయాలను పక్కనబెట్టి స్పందించాలని కోరారు. తెలంగాణ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ,ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రైతులకు ,ఇన్‌పుట్ సబ్సిడీని ఎకరానికి 25వేలు ఇవ్వాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2010 వడగండ్ల వాన, జల్‌తుపాన్,నీలం తుపాన్‌లో నష్టపోయిన తెలంగాణ రైతులను ప్రభుత్వం ఇప్పటికి ఆదుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :తెరాస ఎమ్మెల్యే కేటీఆర్





