హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో దుండగులు రూ.4.9లక్షలు అపహరించారు. ఈరోజు ఉదయం బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్న భారత్ గ్యాస్ ప్రతినిధి నుంచి దుండగులు డబ్బు లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




