Tuesday, 3 November 2026

నేడు నిర్మల్‌ లో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ

నిర్మల్‌ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో సభ నిర్వహిస్తున్నారు.స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్‌ను కాంగ్రెస్‌ నేతల కటౌట్లతో ముంచెత్తారు. పట్టణంలో జాతీయ రహదారి వెంట సోనియా ,రాహుల్‌గాంధీతో పాటు టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల కటౌట్లు ,ప్లెక్సీలు ,ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో భారీ వేదికను నిర్మించడంతో పాటు జిల్లా నలుమూలలా నుంచి 50 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బస్వరాజ్‌ సారయ్య నిర్మల్‌లోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *