హైదరాబాద్ : నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయ దిశలో 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం ప్రస్తుతానికి రాష్ట్రంపై ఉండదని నిపుణులు తెలిపారు.




