వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీఆర్బీఎఫ్ పథకం నిధులు విడుదల అయినట్లు జడ్పీ సీఈఓ జి. ఆంజనేయులు తెలిపారు. 2012-13లో రెండో విడత విడుదల కావాల్సిన నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగిందన్నారు. అదే విధంగా 2013-14లో మోదటి విడత నిధులు విడుదల అయినట్లు సీఈఓ తెలిపారు. రెండు విడతలకు సంబంధించి మొత్తం రూ. 32.16 కోట్లు మంజూరయ్యాయని, వాటిలో 2012-13 రెండో విడతకు రూ. 6.56 కోట్లు. 2013-14 మొదటి విడతకు గాను రూ. 25.60 కోట్లు మంజూరయ్యాయని సీఈఓ తెలిపారు. వీటిలో 50 శాతం పంచాయతీలకు, 30 శాతం మండల పరిషత్‌లకు, 20 శాతం జడ్పీకి కేటాయించనున్నారు.




