Tuesday, 3 November 2026

పీసీసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందలేదు : జేసీ

హైదరాబాద్‌ : తనకు పీసీసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడనంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పోపో అంటున్నారని జేసీ ఆరోపించారు. తన సోదరుడు, కుమారుడు ఏ పార్టీలో చేరేది వాళ్ల ఇష్టమన్నారు. తెదేపా, వైకాపాల నుంచి తనకు ఆహ్వానాలు అందాయని, పార్టీ నుంచి షోకాజ్‌ నోటీసు వచ్చిన తర్వాత స్పందిస్తారని జేసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *