హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రచురించే అధికారిక డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్‌ను 2014సంవత్సరానికిగాను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించిన వీటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మహంతి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ప్రత్యేక డీజీపీ కృష్ణం రాజు ఇతర సీనియర్ అధికార్ల సమక్షంలో సీఎం విడుదల చేశారు. 2014 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు.




