హైదరాబాద్ : సమ్మె నోటీసు ఇచ్చిన ఈయూ, టీఎంయూ నేతలతో కార్మిక శాఖ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. ఆర్టీసీలో ఒప్పంద కండక్టర్లు, డ్రైవర్ల క్రమబద్దీకరణకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. నెలాఖరులోగా 9,518 మంది డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని ఆర్టీసీ తెలిపింది.




