హైదరాబాద్ : స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం కొనసాగుతోంది. ముసాయిదా బిల్లుపై సభలో చర్చ ప్రారంభమైందా లేదా అని బీఏసీ సమావేశంలో అక్బరుద్దీన్ ప్రశ్నించగా, ఆ వివాదంతో సంబంధం లేకుండా చర్చను కొనసాగిద్దామని సభాపతి సమాధానమిచ్చారు. సమైక్య తీర్మానం చేశాకే చర్చకు సహకరిస్తామని వైకాపా తెలపింది. గతంలో తీర్మానానికి పట్టుబడితే సస్పెండ్ చేశారని , ఇప్పుడూ అలాగే చేసి చర్చను కొనసాగించాలని తెరాస సభ్యులు సూచించారు.




